నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదు: సీఐ

19-09-2026 | 02:09pm

భిక్కనూర్, సెప్టెంబర్‌ 19 (విజయ క్రాంతి): గణేష్‌ నిమజ్జన వేడుకల్లో డీజేలు వినియోగించేందుకు అనుమతి లేదని సీఐ జగడం(CIs Altercation) నరేష్‌ స్పష్టం చేశారు. భిక్కనూర్‌ సర్కిల్‌ పరిధిలోని మండపాల నిర్వాహకులు పోలీసుల(Polices) సూచనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. పర్యావరణానికి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా డప్పు చప్పుళ్లతోనే నిమజ్జన ఊరేగింపులు నిర్వహించుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే సంబంధిత నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘డీజే వద్దు.. డప్పు ముద్దు’ నినాదంతో గణేష్‌ నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని సీఐ నరేష్‌ కోరారు.


మరిన్ని వార్తలు