గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ

23-09-2026 | 03:30pm

దమ్మపేట,(విజయక్రాంతి):  వీబీ జీ రాంజీ పథకం(VB-G RAM G Scheme) అమలులో భాగంగా వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలు తయారు చేయడంలో బుధవారం మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు, వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం గండుగులపల్లి రైతు వేదికలో ఎంపీడీవో రవీంద్ర రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి అడిషనల్ డీఆర్డిఓ రవి, ఏపీడీ రమణ, విజయభాస్కర్ రెడ్డి, ఈసీ రాజు హాజరైనారు.

వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక(Vikasit Gram Panchayat Plan) తయారీలో విబిజి రాంజీలో 375 రకాల పనులు ఉన్నాయని అన్ని రకాల ప్రభుత్వ శాఖల సమన్వయంతో రాబోయే మూడు సంవత్సరాలకు గ్రామపంచాయతీని సమగ్రంగా అభివృద్ధి చేయుట కొరకు ప్రణాళికలు మంచిగా చేయాలని అడిషనల్ డిఆర్డీఓ రవి సూచించారు. ప్రతి గ్రామపంచాయతీలో కచ్చితంగా సామాజిక చిత్రపటం, వనరుల చిత్రపటం గ్రామ ప్రజలు సర్పంచ్ వార్డు మెంబర్లు భాగస్వామ్యంతో పూర్తి చేయాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీల ప్రణాళికను అక్టోబర్ రెండున గ్రామసభలో ఆమోదం తీసుకోవాలని తెలిపారు.

మరిన్ని వార్తలు