5 September, 2026 | 3:58 AM

పౌష్టికాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజం

04-09-2026 | 04:55am

నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

ఘనంగా జాతీయ పోషణ వారోత్సవాలు

నిజామాబాద్, సెప్టెంబర్3 (విజయక్రాంతి): ఈ నెల 1 నుంచి 7 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘జాతీయ పోషణ వారోత్సవాల’ సందర్భంగా నిజామాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్స్(Medicover Hospitals) ఆధ్వర్యంలో ప్రజలకు పో షకాహార ప్రాముఖ్యత,ఆహార అలవాట్లపై ప్ర త్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ ఆన ంద్ మాలు, డైటీషియన్ శ్రీలేఖ పాల్గొని ప్రజలకు పలు సూచనలు, జాగ్రత్తలను వెల్లడించారు. డాక్టర్ ఆనంద్ మాలు మాట్లాడుతూ జీవనశైలి వ్యాధులకు పోషకాహార లోపమే మూలమన్నారు. నేటి జీవనశైలిలో సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల టైప్-2 మధుమేహం (డయాబెటిస్), అధిక రక్తపో టు (బీపీ), గుండె సంబంధిత సమస్యలు,  ఊబకాయం వంటి వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి.

సమతుల్య ఆహారం తీసుకో కపోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి, తరచూ ఇన్ఫెక్షన్ల బారి న పడే అవకాశం ఉంది అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ మాలు ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారైనా రక్తపరీక్షలు చేయించేకోవాని, ప్రాసెస్డ్ ఆహారానికి దూరంగా ఉం డాలన్నారు. ఆరోగ్యకరమైన ఆహారంతో పా టు రోజుకు కనీసం30 నిమిషాల వ్యాయా మం లేదా నడక తప్పనిసరని సూచించారు.

డైటీషియన్ శ్రీలేఖ మాట్లాడుతూ ‘పోషకాహారం అంటే ఖరీదైన ఆహారం కాదని, మనకు స్థానికంగా లభించే సహజ సిద్ధమైన పదార్థాలతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని’ తెలిపారు. ప్రతిరోజూ ఆహారంలో పప్పు ధాన్యాలు, గుడ్లు, పనీర్, మొలకెత్తిన విత్తనాలు ఉండేలా చూసుకోవాలన్నారు. జొన్నలు, రాగులు, సజ్జలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయన్నారు. అలాగే రోజువారీ భోజనంలో ఆకుకూరలు, తాజా కూరగాయలు, కాలానుగుణంగా లభించే పండ్లను తీసుకోవాలని, శరీరంలో విషపదార్థాలను తొలగించడానికి, జీర్ణక్రియ సులభతరం కావడానికి రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని సూచించారు.

మరిన్ని వార్తలు