మార్కెట్లోకి ఆసియన్ రోస్టర్స్ ప్రీమియం కాఫీ
అరకు కాఫీ వారసత్వాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో రెండో తరం అడుగు
హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ఆసియన్ రోస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్(Asian Roasters Private Limited) ప్రీమియం కాఫీ మార్కెట్లోకి ప్రవేశించిం ది. ఆసియా స్ఫూర్తితో, ప్రపంచ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకమైన కాఫీ బ్రాండ్ ను నిర్మించాలనే దృక్పథంతో ఈ సంస్థ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కాఫీ వారసత్వం, ఆధునిక ఆవిష్కరణలు, మారుతున్న వినియోగదారుల అభిరుచులను సమన్వ యం చేస్తూ నాణ్యమైన కాఫీని అందించడం పై సంస్థ దృష్టి సారించింది.
ఈ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ఎస్. కృష్ణ హాసిని, డైరెక్టర్‌గా డా. రోజా భారతి నాయకత్వం వహిస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో విద్యను అభ్యసించిన కృష్ణ హాసిని, జాతీయ స్థాయి 10 మీటర్ల ఎయిర్ షూటర్‌గా గుర్తింపు పొందడంతో పాటు వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. డా. రోజా భారతి తెలుగు సినీ రంగంలో గుర్తిం పు పొందిన వ్యక్తిత్వంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా ఆసియన్ రోస్ట ర్స్ సీఈవో ఎస్. కృష్ణ హాసిని మాట్లాడుతూ, అరకు లోయ కాఫీతో మా కుటుంబ ప్రయాణం ప్రతి కప్పు కాఫీ వెనుక ఉన్న ప్రాంతం, నాణ్యత, రైతులు, వారి కృషి విలువను మాకు తెలియజేసింది. ఆసియన్ రోస్ట ర్స్ ద్వారా ఆ వారసత్వాన్ని గౌరవిస్తూనే, భా రత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కాఫీలను వినియోగదారులకు పరిచ యం చేయాలనుకుంటున్నాం.
కాగా ఆసియన్ రోస్టర్స్ కేవలం అరకు లోయ కాఫీకే పరిమితం కాకుండా, భారత్‌తో పాటు ప్ర పంచంలోని ప్రముఖ కాఫీ సాగు ప్రాంతాల నుంచి నాణ్యమైన కాఫీ గింజలను సేకరించి, వాటిని ఎంపిక చేసి రోస్టింగ్ చేయనుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సం స్థ, నాణ్యత, నైపుణ్యం, సాంకేతికత, అంతర్జాతీయ కాఫీ సంస్కృతుల స్ఫూర్తిని సమన్వయం చేస్తూ ప్రపంచ ప్రీమియం కాఫీ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది