బ్యాంక్ ఆఫ్ బరోడా ఫెస్టివల్ ఆఫర్లు

23-10-2026 | 05:15am

ముంబై: భారతదేశపు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank of Baroda), తన పండుగ ప్రచారం బీవోబీ కే సంగ్ త్యోహార్ కీ ఉమంగ్ శుభ్ భీ, లాభ్ భీ ప్రారంభాన్ని ప్రకటించింది. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు పండుగ ఆర్థిక ఆకాంక్షలను మరింత సులభంగా, లాభదాయకంగా మార్చడానికి రిటైల్ రుణాలు, ఎంఎస్‌ఎంఈ రుణాలు, పొదుపు ఉత్పత్తులు, డెబిట్ కార్డ్ ఖర్చులపై సమగ్రమైన ఆఫర్లను అందిస్తుంది.

ముఖ్యంగా గృహ రుణాలు: సంవత్సరానికి 7.40% నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లతో , త్వరిత మంజూరు, కనీస పత్రాలు,ప్రాసెసింగ్ ఫీజులపై 100% మినహాయింపు. అలాగే కారు ,వాహన రుణాలపై ఆన్-రోడ్ ధరపై 90% వరకు ఫైనాన్సింగ్‌తో తగ్గిన వడ్డీ రేట్లు, ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) లోన్లు: 8 సంవత్సరాల వరకు పొడిగించిన తిరిగి చెల్లింపు గడువులతో పాటు, ప్రాసెసింగ్ ఛార్జీలపై 50% రాయితీ ఇచ్చింది.

ఎంఎస్‌ఎంఈ, పొదుపు ఉత్పత్తులపై ప్రత్యేక పండుగ రాయితీలు, తక్కువ నెలవారీ సగటు నిల్వ అవసరాలు, ఉచిత ప్రయాణ డెబిట్ కార్డులు, లాకర్ డిస్కౌంట్లను అందించే బాబ్ మాస్టర్ స్ట్రోక్ లైట్ పొదుపు ఖాతా.. బాబ్‌కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ డీల్స్‌పై  500+ పండుగ ఆఫర్లు: ప్రయాణం, ఫ్యాషన్, స్మార్ట్ టెక్, గృహాలంకరణ, ఆహారం, అమెజాన్, ఫిప్‌కార్ట్, క్రోమా వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై తగ్గింపులు.

పండుగ ఈఎంఐ ఎంపికలు: పూర్తి చెల్లింపు లేదా ఈఎంఐపై 3 నుంచి 48 నెలల వరకు అనువైన కాలపరిమితులు, శుక్రవారాలు మరియు శనివారాలలో 12% వరకు తగ్గింపుతో వారాంతపు ప్రత్యేక ఆఫర్లు కూడా ఉన్నాయి.క్రమశిక్షణతో కూడిన పొదుపును అలవర్చుకోవాలనుకునే కస్టమర్ల కోసం, ‘బీవోబీ ఫ్లెక్సి సిస్టమాటిక్ డిపాజిట్ ప్లాన్’ నెలకు కేవలం రూ.500 నుంచి ప్రారంభమయ్యే తక్కువ పరిమితిని అందిస్తుంది. దీనితో పాటు డిపాజిట్ కాలమంతటికీ స్థిర వడ్డీ రేట్లు లాక్ చేయబడతాయి.

ఈ పండుగ ప్రచారం గురించి బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీనా వహీద్ మాట్లాడుతూ మా పండుగ ఆఫర్ల ద్వారా, పోటీ వడ్డీ రేట్లు , ఆకర్షణీయమైన ప్రయోజనాలతో ఫైనాన్సింగ్‌ను మరింత సులభంగా,లాభదాయకంగా మార్చడమే మా లక్ష్యం. విభిన్న కస్టమర్ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన పరిష్కారాలతో, బ్యాంక్ ఆఫ్ బరోడా మా కస్టమర్ల ఆర్థిక ప్రయాణంలో ప్రతి అడుగులోనూ మద్దతుగా నిలవడానికి కట్టుబడి ఉంది. అని అన్నారు.

మరిన్ని వార్తలు