ఒరాకిల్ ఉద్యోగులకు సీఎఫ్‌వో కీలక సూచనలు
ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్(Oracle)లో మరోసారి ఉద్యోగుల తొలగింపులు చోటుచేసుకున్న నేపథ్యంలో కంపెనీ సీఎఫ్‌వో హిల్లరీ మాక్స్‌సన్ (CFO Hillary Maxson)ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు. సంస్థ నిర్వహించిన ‘ఆల్ హ్యాండ్స్’ సమావేశంలో మాట్లాడిన ఆమె.. కంపెనీ ఆర్థిక వృద్ధికి ఉద్యోగులు తమ వంతు సహకారం అందించాలని కోరారు.
సంస్థ వృద్ధి కొనసాగాలంటే సమయం, డబ్బును ఆలోచనాత్మకంగా వినియోగించాల్సిన అవసరం ఉందని మాక్స్‌సన్ పేర్కొన్నారు. అయితే, తక్కువ వనరులతో ఎక్కువ పని చేయాలని తాను సూచించడం లేదని స్పష్టం చేశారు. వినియోగదారులకు పెద్దగా ప్రయోజనం చేకూర్చని పనులకు బదులుగా, అత్యధిక విలువను అందించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ఉద్యోగులకు సూచించారు.
కంపెనీ వృద్ధి, వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం వంటి అంశాలను ఆమె సమావేశంలో ప్రస్తావించారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో ఇటీవల చేపట్టిన ఉద్యోగుల తొలగింపులపై మాత్రం మాక్స్‌సన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.
కాగా, గత ఏడాది కాలంలో ఒరాకిల్ 20 వేలకు పైగా ఉద్యోగాలను తొలగించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. లేఆఫ్ జాబితాలో ఉన్న మరికొందరు ఉద్యోగులను మంగళవారం కూడా కంపెనీ తొలగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎఫ్‌వో ఉద్యోగులకు చేసిన సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 50 పదాల్లో కావాలి