ఉమ్మడి జిల్లాల్లో ఆయిల్ పామ్ పరిశ్రమల ఏర్పాటు

16-09-2026 | 01:16pm

సాగులో నష్టం రాకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదే

మొదట జనగామ, మహబూబాబాద్ లోనే పరిశ్రమలు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) ఏడోరోజు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Raoమాట్లాడుతూ... 2026-27లో అదనంగా 2 లక్షల ఎకరాల్లో ఉద్వాసన పంటల సాకుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉద్వాన పంటల సాగు పెంపునకు  40-90 శాతం రాయితీపై పరికరాలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఉద్వాన పంటల సాగు పెంపునకు రూ. 150 కోట్లు, ఆయిల్ పామ్ సాగు అభివృద్ధికి రూ. 261 కోట్లు కేటాయించామని లెక్క చెప్పారు. బిందు, తుంపర సేద్యం కోసం రూ.243 కోట్లు కేటాయించామని తెలిపారు.

ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ అగ్రస్థానం

రాష్ట్రంలో 88వేల మంది రైతులు 3.25 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు(Oil Palm Cultivation) చేస్తున్నట్లు వివరించారు. 2021-22లో 2.74 లక్షల ఎకరాల ఆయిల్ పామ్ సాగుతో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. 2023 డిసెంబర్ నుంచి 1.37 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాకులోకి తెచ్చామని వివరించారు. సోలార్ వ్యవస్థ ద్వారా రైతుల ఉద్వాసన పంటల సాగుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆయిల్ పామ్ సాగులో నష్టం రాకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేని తుమ్మల హామీ ఇచ్చారు. పదివేల ఎకరాల్లో పంట పండిస్తే పరిశ్రమ నిరంతరం నడుస్తోందని సూచించారు.

ఇప్పటికే 14 పరిశ్రమలు గుర్తించాం.. నిర్మాణం జరుగుతోందన్నారు. ఆరు పరిశ్రమలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. తొలుత ఉమ్మడి జిల్లాల్లో ఆయిల్ పామ్ పరిశ్రమలు(Oil palm industries) ఏర్పాటు చేస్తామని తెలిపారు. పంట ఎక్కువ వచ్చే జనగామ, మహబూబాబాద్ లో పరిశ్రమలు వస్తాయని ప్రకటించారు. కనీసం పది వేల ఎకరాల్లో ఆయిల్ పామ్  పంట వచ్చేలా చూడాలన్నారు. ఆరు నెలల్లో పరిశ్రమ ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. ఆయిల్ పామ్ కు సంబంధించి మార్కెటింగ్ , ఎగుమతుల సమస్య లేదని వివరించారు. ఆయిల్ పామ్ కు ఎంఎస్ పీ అంశం కేంద్రం పరిధిలో ఉందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.




మరిన్ని వార్తలు