'చేయూత' పింఛన్లకు లాస్ట్ ఛాన్స్
16-09-2026 | 09:03am
హైదరాబాద్: 'చేయూత' పింఛను(Cheyutha Pension) దరఖాస్తుల గడువును తెలంగాణ(Telangana) ప్రభుత్వం మరో రోజు పొడిగించింది. దీంతో అర్హులైన వారు బుధవారం సాయంత్రం 5 గంటల వరకు తమ దరఖాస్తులు సమర్పించేందుకు సర్కార్ అవకాశం కల్పించింది. ఇప్పటివరకు 5.78 లక్షల దరఖాస్తులు అందినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మంత్రి సీతక్క(Minister Seethakka) ఆదేశాల మేరకు గడువును పొడిగించారు. వరుసగా సెలవు దినాలను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వం(Telangana Government) ఇంతకుముందే గడువును పొడిగించింది. దరఖాస్తులు సమర్పించడానికి మంగళవారం చివరి తేదీగా ఉంది. SERP సీఈఓ దివ్య దేవరాజన్ గడువును బుధవారం సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తూ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.