విద్యుత్ షాక్ తో యువరైతు మృతి

16-09-2026 | 08:26am

మఠంపల్లి సెప్టెంబర్ 16(విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం(Mattampally Mandal) చౌటుపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ ఏబీ స్విచ్ను ఆన్-ఆఫ్ చేస్తుండగా గుండెబోయిన శ్రీనివాస్ యాదవ్ (29)కు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు