ఆటోపేకు MDR వర్తిస్తుందా..? NPCI FAQలో క్లారిటీ

16-09-2026 | 03:19pm

రూ.2 వేల దాటితే ఛార్జీలు చెల్లించాలా..?

ఎన్‌పీసీఐ FAQలో కీలక విషయాలు

యూపీఐ (UPI) లావాదేవీలకు సంబంధించి మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (MDR)పై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) కీలక ప్రకటన చేసింది. అక్టోబర్‌ 15 నుంచి ఎంపిక చేసిన యూపీఐ లావాదేవీలకు ఈ ఛార్జీలు వర్తించనున్నట్లు వెల్లడించింది. రూ.2,000లోపు లావాదేవీలపై ఎలాంటి ఎండీఆర్ ఉండదని, అంతకంటే ఎక్కువ మొత్తానికి సంబంధించిన నిర్దిష్ట లావాదేవీలపై 0.4 శాతం వరకు ఛార్జీ విధించే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ ఛార్జీకి గరిష్ఠ పరిమితిని రూ.300గా నిర్ణయించింది.

అయితే ఈ ఛార్జీలను ఎవరు చెల్లించాలి? రూ.2,000 దాటిన ప్రతి యూపీఐ చెల్లింపుపైనా MDR వర్తిస్తుందా? ఆటోపే వంటి లావాదేవీలకు కూడా ఈ ఛార్జీలు ఉంటాయా? అనే సందేహాలు వినియోగదారుల్లో నెలకొన్నాయి. ఈ ప్రశ్నలకు స్పష్టత ఇచ్చేందుకు ఎన్‌పీసీఐ FAQను విడుదల చేసింది. ఇందులో MDR ఏయే లావాదేవీలకు వర్తిస్తుంది, ఎవరిపై ఛార్జీల భారం ఉంటుంది, వినియోగదారులు నేరుగా ఏమైనా చెల్లించాల్సి ఉంటుందా వంటి అంశాలను వివరించింది. ముఖ్యంగా.. రూ.2,000 దాటిన ప్రతి యూపీఐ లావాదేవీపై వినియోగదారుడే MDR చెల్లించాల్సి ఉంటుందనే అర్థం కాదని ఎన్‌పీసీఐ వివరణ ఇచ్చింది. ఛార్జీలు వర్తించే లావాదేవీల విషయంలో వాటిని ఎవరు భరించాలనే నిబంధనలు ప్రత్యేకంగా ఉంటాయి.

మరిన్ని వార్తలు