ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. 22Aపై కమిటీ ఏర్పాటు?
16-09-2026 | 08:18am
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) ఏడో రోజు కొనసాగుతున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad) ప్రశ్నోత్తరాలతో సమావేశాలను ప్రారంభించనున్నారు. 22A నిషేధిత భూముల అంశంపై(Telangana 22A Prohibited Property) అసెంబ్లీలో చర్చకొనసాగనుంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) 22ఏ నిషేధిత భూముల అంశంపై చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. 22ఏపై కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. 22ఏ కమిటీపై అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన చేసే అవకాశముంది. ఎల్ నినోపై తీసుకోవాల్సిన నివారణ చర్యలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది.