ధనత్రయోదశికి కనక వర్షం

07-11-2026 | 07:41am

ఒక్కరోజే రూ.1.25 లక్షల కోట్ల బిజినెస్!

హైదరాబాద్: ధనత్రయోదశి సందర్భంగా దేశవ్యాప్తంగా మార్కెట్లు కాసుల వర్షం కురిపించాయి. బంగారం, వెండి, కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లతో Retail Market కళకళలాడింది. ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా సుమారు రూ.1.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇందులో బంగారం, వెండి అమ్మకాల వాటానే రూ.66 వేల కోట్లకు పైగా ఉండటం విశేషం. పండగకు ముందు Precious Metals ధరలు కొంత తగ్గడం కొనుగోలుదారులకు కలిసొచ్చింది. ధరలు భారీగా ఉన్నప్పటికీ Gold, Silver కొనుగోళ్లపై వినియోగదారులు వెనక్కి తగ్గలేదు. ముఖ్యంగా Lightweight Jewellery, 14 క్యారెట్, 18 క్యారెట్ ఆభరణాలతో పాటు చిన్న Gold Coins, Silver Coins కొనుగోళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. పెళ్లిళ్ల సీజన్ కూడా అమ్మకాలకు ఊతమిచ్చింది. ధరల తగ్గుదలతో Jewellery Showrooms వద్ద Customer Footfall పెరిగినట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు Automobile Sectorలోనూ పండగ జోరు కనిపించింది. కొత్త కారు కొనుగోలు చేయాలన్న ఆసక్తితో పెద్ద సంఖ్యలో వినియోగదారులు Showroomsకు చేరుకున్నారు. దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ Maruti Suzuki India ఒక్కరోజే సుమారు 30 వేల కార్లను కస్టమర్లకు Delivery ఇచ్చినట్లు ప్రకటించింది. Hyundai, Tata Motors వంటి కంపెనీలు కూడా భారీ డెలివరీలకు సిద్ధమయ్యాయి. మొత్తం Passenger Vehicle విభాగంలో ధనత్రయోదశి రోజున లక్షకు చేరువగా కార్ల డెలివరీలు జరిగి ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. Home Appliances విభాగంలోనూ కొనుగోళ్లు ఊపందుకున్నాయి. Refrigerators, Air Conditioners, Washing Machines, Kitchen Appliancesకు డిమాండ్ పెరిగింది. పలు కంపెనీలు Double-Digit Growth నమోదు చేసినట్లు వెల్లడించాయి. కొన్ని బ్రాండ్లలో అమ్మకాల విలువ గణనీయంగా పెరిగింది. ఇక Electronics, Utensils, Apparel, Footwear, ఇతర గృహోపకరణాల కొనుగోళ్లతో రిటైల్ వ్యాపారం మరింత పుంజుకుంది. మొత్తంగా ఈ ఏడాది ధనత్రయోదశి భారత Retail Marketకు భారీ ఊరటనిచ్చింది. Gold నుంచి Cars వరకు అన్ని ప్రధాన విభాగాల్లోనూ కొనుగోళ్ల సందడి కనిపించింది. పండగ సీజన్‌లో వినియోగదారుల Spending Power, మార్కెట్లపై నమ్మకం బలంగా ఉన్నాయనే సంకేతాలను ఈ అమ్మకాలు ఇచ్చాయి.

మరిన్ని వార్తలు