ఏక్తామాల్ పేరుతో భారీ దోపిడీ!

07-11-2026 | 05:15am

ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాం తి) : ఏక్తామాల్ ప్రాజెక్టు పేరుతో(Ekta Mall Project Scam) రాష్ట్ర ప్రభు త్వం భారీ దోపిడీకి తెరతీసిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.202 కోట్లు, ద ళిత చేతివృత్తుల సంస్థ టీజీ లిప్కోకు చెందిన 6.12 ఎకరాల విలువైన భూమి, నేతన్నలు, హస్తకళాకారుల భవిష్యత్తును ప్రైవేట్ బిల్డర్ల ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు.

ఏక్తా మాల్ ప్రాజెక్టు ను వాణిజ్యపరంగా లాభదాయకం చేసే పేరుతో వంశీరాం బిల్డర్స్, అపర్ణ బిల్డర్స్‌కు భారీ ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం వ్య వహరిస్తోందని పేర్కొన్నారు. మొత్తం 27 లక్షల చదరపు అడుగుల నిర్మాణంలో కళాకారుల ఏక్తామాల్‌కు కేవలం 2.13 లక్షల చదరపు అడుగులు మాత్రమే కేటాయించారని, ఇది మొత్తం నిర్మాణంలో 8 శా తం కూడా కాదని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు 7 లక్షల చదరపు అడుగులు (26 శా తం), ప్రైవేట్ బిల్డర్లకు 17.82 లక్షల చదరపు అడుగులు (66 శాతం) కేటాయిస్తున్నారని ఆరోపించారు.

దీనిపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ను పోలీసు లు అరెస్టు చేయడాన్ని ఖండించారు. రాష్ట్రం లో నడుస్తున్నది అంబేడ్కర్ రాజ్యాంగమా? లేక ’అను ముల రాజ్యాంగమా’? అని డీజీపీని ప్రశ్నించారు. కేసులను వెంటనే ఉపసంహరించుకుని, బాలరాజు యాదవ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తలు