ముషీరాబాద్ సత్తార్‌బాగ్‌లో దున్నల సందడి

07-11-2026 | 05:15am
  1. 10న నారాయణగూడలో సదర్ ఉత్సవాలు
  2. అఖిలభారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ 

ముషీరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): దీపావళి పండుగను(Diwali Festival) పురస్కరిం చుకొని యాదవులు వైభవంగా నిర్వహించే సదరు ఉత్సవాలలో పంజాబ్, హరియానా రాష్ట్రాలకు చెందిన భారీ దున్నలు సదరులో సందడి చేయనున్నాయి. నవంబర్ 10న నగరంలోని నారాయణగూడలో నిర్వహించే సదరు ఉత్సవాలలో వివిద రాష్ట్రాలకు చెంది న దున్నలు పాల్గొనే విధంగా ముషీరాబాద్ కు చెందిన అఖిల భారత యదవ మహాసభ(All India Yadav Mahasabha) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీఆర్‌ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ హరియానా రాష్ట్రం నుంచి ప్రత్యేక వాహనంలో రెండున్నరేళ్ల యువరాజు -2 దున్నా, నాలుగేళ్లు ఉన్న ఖలీ దున్నలను తీసుకువచ్చారు. పంజాబ్ రాష్ట్రం నుంచి ఆరేళ్ల రోలె క్స్, రాజా, షేర్, శ్రీకృష్ణ దున్నలను  తీసుకువచ్చారు. భారీ ఆకారంలో గంభీరం గా ఉండడంతో అందరినీ ఆకట్టుకున్నాయి.

18 ఏళ్లుగా సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం..

18 ఏళ్లుగా ముషీరాబాద్‌లో సదరు ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, వివిద రాష్ట్రాల నుంచి భారీ ఆకారంలో ఉన్న దున్నలను తీసుకువచ్చి సదరు ఉత్సవాలలో పాల్గొనేలా ఏర్పాటు చేస్తున్నామని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదరి ఎడ్ల హరిబాబు యాదవ్ అన్నారు. సదరు ఉత్సవాలు యాదవుల్లో ఐక్యతను పెంపొందించడంతోపాటు తమ వృత్తిని కాపాడుకు నే విధంగా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ముషీరాబాద్‌లో జరిగే ఉత్సవాలకు రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలిపారు.

దున్నల ప్రత్యేకతలు..

ఆరున్నర అడుగుల ఎత్తు,  1800ల నుంచి 2వేల కిలోల బరువు ఉన్న ముర్రా జాతికి చెందిన ఈ దున్నలు నేషనల్ ఛాంపియన్ షిప్ పశువుల ప్రదర్శనలో ప్రత్యేక బహుమతులు పొందాయి. పండ్లు, డ్రైఫ్రూ ట్స్, బెల్లం, 20లీటర్ల పాలు, ప్రతిరోజు ఆహారంగా వీటికి అందిస్తారు. ప్రతి రోజు రెండుసార్లు స్నానం చేయించి ఆయిల్ మసాజ్ చేస్తారు.

సదర్ ఉత్సవాలకు రూ.10కోట్లు కేటాయించాలి..

యాదవ కులస్తులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే సదరు ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.5 కోట్ల నిధులు సరిపోవడం లేదని వాటిని రూ.10 కోట్లకు పెంచాలని  మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ముషీరాబాద్ లోని సత్తర్ బాగ్ లో దున్నల ప్రదర్శన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎడ్ల హరిబాబు యాదవ్ తో కలిసి బడుగు లింగయ్య యాదవ్ మాట్లాడారు.

సదరును రాష్ట్ర పండుగగా ప్రకటించి నిధుల కేటాయింపులో ప్రభుత్వం శ్రద్ధచూపకోవడం వలన యాదవులకు న్యాయం జరగ డంలేదని ఆరోపించారు. సదరు ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ కార్యదర్శి అయోద్య యాదవ్, యూత్ కమి టీ రాష్ట్ర అధ్యక్షుడు గొర్ల యశ్వంత్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు తలసారి సాయి యాదవ్, స్కైలాబ్ యాదవ్, ముఠా జైసిం హ, సదరు ఉత్సవ నిర్వాహకులు వరుణ్, అభినందన్ యాదవ్, సాయి, వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు