టీఆర్‌ఎస్ వల్లే ప్రత్యేక ఎస్టీ కమిషన్!

07-11-2026 | 05:15am

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత హర్షం

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణలో ప్రత్యేక ఎస్టీ కమిషన్(ST Commission) ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదించడం పట్ల టీఆర్‌ఎస్ చీఫ్ కవిత(TRS chief Kavitha) హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీ డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గి, ఆదివాసీలు, గిరిజనుల ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె తన ‘ఎక్స్’ ఖాతాలో స్పందించా రు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎస్సీ, ఎస్టీ కమిషన్లను కలి పి ఏర్పాటు చేయడం వల్ల రెండు వర్గాల సమస్యలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని కవిత అభిప్రాయపడ్డారు.

సమాజంలో ఎస్సీలు, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు భిన్నమైనవని పేర్కొన్నారు. ఎస్సీలు ఇప్పటికీ పీడన, అణచివేత, దౌర్జన్యాలను ఎదుర్కొంటున్నారని, ఆదివాసీలను వివిధ కారణాలతో అడవుల నుంచి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనుల జీవనాధారమైన జల్, జంగల్, జమీన్‌పై వారి హక్కులు కోల్పోయే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు. కొత్తగా ఏర్పాటయ్యే ఎస్టీ కమిషన్ ఆదివాసీలు, గిరిజనుల ఆకాంక్షలకు ప్రతీకగా నిలవాలని కవిత సూచించారు. వారి ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ, వారి హక్కుల పరిరక్షణకు అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.


మరిన్ని వార్తలు