పెట్టుబడులకు తెలంగాణ గ్లోబల్ హబ్
- పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ ప్రోత్సాహం
- యువతకు ఉపాధి అవకాశాలే మా ప్రాధాన్యత: మంత్రి శ్రీధర్‌బాబు
- గ్లోబల్ సమ్మిట్‌కు ప్రీ- సమ్మిట్‌గా 19 నుంచి 22 వరకు ఇండియన్ రోడ్ కాంగ్రెస్: మంత్రి వెంకట్‌రెడ్డి
- పికో టెక్నాలజీ ఇండియా ప్రై.లి. ప్రధాన కార్యాలయం ప్రారంభం
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణను అంతర్జాతీయ(Telangana is international) పెట్టుబడులకు గ మ్యస్థానంగా, ప్రపంచ స్థాయి పారిశ్రామిక సంస్థలకు(World-class industrial organization) ఆకర్షణీయమైన కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రానికి పెద్ద ఎ త్తున పెట్టుబడులను తీసుకురావడంతోపాటు స్థా నిక యువతకు నైపుణ్యానికి తగిన ఉద్యోగ, ఉపా ధి అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని ఫైనా న్షియల్ డిస్ట్రిక్ట్‌లో పికో టెక్నాలజీ ఇండియా ప్రైవే ట్ లిమిటెడ్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని మం త్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆ సంస్థ ఫౌండర్ సీఈవో జారోడ్ యస్టర్, ఏఐసీవో జీ సీతారాంతో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తెలంగాణ వైపు చూసేలా రాష్ట్రంలో అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సహకారం అందిస్తూ పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని తెలిపారు.
సామర్థ్యాన్ని చాటిచెప్పే వేదిక గ్లోబల్ సమ్మిట్
కొత్త సంస్థల రాకతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడమే కాకుండా యువతకు మెరుగైన భవిష్యత్తు అందుతుందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా గ్లోబల్ సమ్మిట్ పాలసీని తీసుకొచ్చామని, రాష్ట్ర పెట్టుబడుల సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పేందుకు ఈ కార్యక్రమం కీలక వేదికగా నిలిచిందన్నారు. ఈ సారి డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ వేదికగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు, పారిశ్రామిక దిగ్గజాలను ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణకు పిలిచి, రాష్ట్రంలో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను పరిచయం చేసి, పెట్టుబడులను ఆహ్వానించనున్నట్టు ఆయన తెలిపారు.
19 నుంచి 22 వరకు ప్రీ సమ్మిట్: వెంకట్‌రెడ్డి
తెలంగాణను పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి ఐటీ, సాంకేతిక సంస్థలకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్నదని, ప్రపంచస్థాయి కంపెనీలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ముందుకు రావడం తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
పికో టెక్నాలజీ ఇండియా వంటి సంస్థలు హైదరాబాద్‌లో తమ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, అత్యాధునిక సాంకేతికతకు అంతర్జాతీయ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. గ్లోబల్ సమ్మిట్‌కు ప్రీ- సమ్మిట్ కార్యక్రమంగా ఈ నెల 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. దేశవ్యాప్తంగా రహదారుల రంగానికి చెందిన నిపుణులు, ఇంజినీర్లు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు.