పెద్దల వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలి

19-09-2026 | 05:20am

ప్రత్యేక డ్రైవ్‌లు అవసరం

అడల్ట్ వ్యాక్సినేషన్‌పై ‘మెడికవర్’ అవగాహన కార్యక్రమం   

హైదరాబాద్, సెప్టెంబర్ 18(విజయక్రాంతి): టీకాలు చిన్నారుల(Vaccines for children)తోనే ఆగిపోవ ద్దని.. పెద్దలకు కూడా వయసు, ఆరోగ్య పరిస్థితులు(Health conditions), ఇన్ఫెక్షన్ల ముప్పును బట్టి వ్యాక్సినేష న్ అవసరమని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యు లు తెలిపారు. పెద్దల్లో వ్యాక్సినేన్‌పై అవగాహన పెంచేందుకు మెడికవర్ హాస్పిటల్స్(Medicover Hospitals), ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. వృద్ధులు(Elderly people), మధుమేహం(diabetes), గుండె జబ్బులు(heart disease), ఊపిరితిత్తుల సమస్యలు(lung problems) వంటి దీర్ఘకాలిక వ్యాధుల తో బాధపడుతున్న వారిలో కొన్ని ఇన్ఫెక్షన్లు(Infections) తీవ్రంగా మారే అవకాశం ఉన్నందున, అవసరమైన వారికి ముందస్తు వ్యాక్సినేన్‌(Vaccinane)పై దృ ష్టి పెట్టాలని వైద్యులు సూచించారు.

మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ పల్మ నాలజిస్ట్ డాక్టర్ ఉమేష్ వర్మ మాట్లాడుతూ వృద్ధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారు ఇన్‌ఫ్లు యెంజా, న్యూమోకోకల్ వంటి ఇన్ఫెక్షన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వైద్యుల సలహా మేరకు అవసరమైన వ్యాక్సిన్లు తీసుకోవడం ముందస్తు రక్షణలో భాగం అని అన్నారు. సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్స్ డాక్టర్ రాహుల్ గాంధీ, డాక్టర్ జగదీష్ మా ట్లాడుతూ ప్రతి పెద్దవారికి ఒకే వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉండదు.

వయసు, గతంలో తీసుకున్న టీకాలు, ఆరోగ్య పరిస్థితులు, దీర్ఘకాలిక వ్యాధులు, వృత్తి, ప్రయాణాలు, రోగనిరోధక శక్తి వంటి అంశాలను బట్టి వ్యాక్సి నేషన్ను నిర్ణయించాలి అని తెలిపారు. సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్స్ డాక్టర్ అనుషా బండారు, డాక్టర్ నిహారిక మాట్లాడుతూ, అడల్ట్ వ్యాక్సినేన్‌పై అవగాహనను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆసుపత్రులు, వైద్య సంస్థలతో పాటు ప్రభుత్వ స్థాయిలో కూడా ప్రత్యేక అడల్ట్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు, ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే అధిక ముప్పు ఉన్న వర్గాలకు వ్యాక్సినేషన్‌ను మరింత చేరువ చేయవచ్చు అని అన్నారు.

పల్మనాలజిస్ట్ డాక్టర్ యశస్విని మాట్లాడుతూ  శ్వాస కోశ ఇన్ఫెక్షన్లు ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారిలో తీవ్రంగా మారవచ్చు. ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వా త చికిత్స కంటే, సాధ్యమైన చోట ముందుగానే నివారణకు ప్రాధాన్యత ఇవ్వడం ము ఖ్యం అని అన్నారు. కాగా మెడికవర్ హాస్పిటల్స్‌లో అడల్ట్ వ్యాక్సినేషన్ సేవల్లో ఇన్‌ఫ్లు యెంజా, న్యూమోకోకల్, టీడీఏపీ, హెచ్‌పీవీ, హెర్పిస్ జోస్టర్ (షింగిల్స్), హెపటైటి స్-బి వంటి వ్యాక్సిన్లు వైద్యుల సూచన మేర కు అందుబాటులో ఉంటాయి.

వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారు, ఆరోగ్య సిబ్బంది, ఇతర అధిక ము ప్పు ఉన్న పెద్దలు తమకు అవసరమైన వ్యా క్సిన్లపై వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచించారు. చిన్నారుల టీకాలతో పాటు పెద్దల వ్యాక్సినేషన్‌పై కూడా ప్రజారోగ్య కా ర్యక్రమాల్లో మరింత ప్రాధాన్యతతో చూడాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు