మళ్లీ పెరిగిన బంగారం.. కొనేవాళ్లకు టెన్షన్!

30-09-2026 | 10:55am

పసిడి ధరలకు మళ్లీ రెక్కలు.. ఎంత పెరిగిందంటే?

హైదరాబాద్: పసిడి ధరలు మళ్లీ కాస్త పైకి కదిలాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో(Hyderabad Gold Price) బంగారం రేట్లు స్వల్పంగా పెరగడంతో కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది. ముఖ్యంగా 24 క్యారెట్ల బంగారం(24K Gold Rate) ధర 10 గ్రాములకు రూ.770 పెరగడం గమనార్హం. తాజా Gold Rate Today వివరాల ప్రకారం.. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,570కు చేరింది. అంతకుముందు ధరతో పోలిస్తే రూ.770 పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.1,37,100గా నమోదైంది.

వెండి ధరలో మాత్రం మార్పు లేదు

బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి(Silver) మార్కెట్‌లో మాత్రం పెద్దగా కదలిక కనిపించలేదు. గత రెండు రోజులుగా కిలో వెండి ధర రూ.2,40,000 వద్దే కొనసాగుతోంది. అయితే నగలు కొనుగోలు చేసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఉంది. మార్కెట్‌లో చూపించే బంగారం ధరలకు అదనంగా 3 శాతం GST చెల్లించాల్సి ఉంటుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో స్థానిక మార్కెట్ పరిస్థితులు, ఇతర ఛార్జీలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. అందుకే బంగారం కొనుగోలు చేసే ముందు స్థానిక జువెల్లరీ షాపులో తాజా ధరను ఒకసారి నిర్ధారించుకోవడం మంచిది.

మరిన్ని వార్తలు