సోషల్ మీడియా షేక్.. కృష్ణ Vs మహేశ్ బాబు

30-09-2026 | 08:48am

సూపర్‌స్టార్ కృష్ణ.. మహేశ్ బాబు(Mahesh Babu AI Video).. తెలుగు సినీ అభిమానులకు ఈ తండ్రి-కొడుకుల కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తేనే అభిమానులకు పండగలా ఉంటుంది. అలాంటిది కృష్ణ-మహేశ్ బాబు కలిసి ఫైట్ చేస్తున్నట్టుగా కనిపించే వీడియో సోషల్ మీడియాలోకి వస్తే ఇక వైరల్ కాకుండా ఉంటుందా?ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో కృష్ణ, మహేశ్ బాబు(Krishna Mahesh Babu Fight) గుండాలుపై దాడి చేసుకుంటున్నట్టుగా విజువల్స్ కనిపిస్తున్నాయి. దీంతో వీడియో చూసిన అభిమానులు మొదట షాక్‌కు గురవుతున్నారు. అయితే ఇది నిజంగా జరిగిన ఫైట్ కాదు. ఇలాంటి విజువల్స్‌ను AI టెక్నాలజీ, ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ ద్వారా రూపొందిస్తున్నారు.

ఇటీవల కూడా మహేశ్ బాబు ముఖాన్ని ఆయన తండ్రి కృష్ణ(Superstar Krishna Viral Video) నటించిన పాత సినిమా సన్నివేశంలో AI ద్వారా చూపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహేశ్ బాబు అభిమానులు ఆ వీడియోను తెగ షేర్ చేయడంతో మరోసారి AI ఎడిట్స్‌పై ఆసక్తి పెరిగింది. ఇక కృష్ణ-మహేశ్ బాబు ఫైట్ అంటూ వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా అభిమానుల ఊహకు టెక్నాలజీ జోడించిన క్రియేటివ్ ఎడిట్‌గా కనిపిస్తోంది. తండ్రి-కొడుకులు(Krishna Mahesh Babu Fight) నిజంగా కలిసి ఓ భారీ యాక్షన్ సీన్ చేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో అభిమానులకు ఒక ఊహాజనిత అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా కృష్ణ అభిమానులు, మహేశ్ బాబు ఫ్యాన్స్ ఈ వీడియోను ఆసక్తిగా చూస్తున్నారు. నిజమైన సినిమా సన్నివేశంలా కనిపించేలా AI టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో నిజం ఏది.. AI ఎడిట్ ఏది గుర్తించడం కూడా కొన్నిసార్లు కష్టంగా మారుతోంది. అందుకే వైరల్ వీడియోలను షేర్ చేసే ముందు వాటి అసలైన నేపథ్యాన్ని తెలుసుకోవడం అవసరం.



మరిన్ని వార్తలు