సెలెక్టర్లకు షాక్ ఇస్తాడా?
ఏడు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్(Akash Deep Comeback) మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. లోయర్ బ్యాక్‌లో స్ట్రెస్ ఫ్రాక్చర్ కారణంగా సుదీర్ఘంగా రిహాబిలిటేషన్ తీసుకున్న అతడు.. ఇప్పుడు ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున జమ్మూ కశ్మీర్‌తో తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆకాశ్ దీప్ ఫిట్నెస్తో పాటు అతడి బౌలింగ్ రిథమ్‌పై అందరి దృష్టి నెలకొంది.
7 నెలల తర్వాత అసలు పరీక్ష!
ఆకాశ్ దీప్ చివరిసారిగా ఫిబ్రవరిలో జమ్మూ కశ్మీర్‌తో జరిగిన రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో(Ranji Trophy semi-final) ఆడాడు. ఆ తర్వాత లోయర్ బ్యాక్ స్ట్రెస్ ఇంజ్యూరీ కారణంగా మైదానానికి దూరమయ్యాడు. దాదాపు ఏడు నెలల రిహాబిలిటేషన్ తర్వాత ఇప్పుడు పోటీ క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇరానీ కప్‌లో అతడి ప్రదర్శన కేవలం ఓ దేశవాళీ మ్యాచ్‌కే పరిమితం కాదు. ఆకాశ్ దీప్ ఫిట్నెస్, బౌలింగ్ రిథమ్‌ను సెలెక్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది.
న్యూజిలాండ్ టూర్‌ను(India vs New Zealand) దృష్టిలో పెట్టుకుని భారత టెస్టు(Team India Test Squad) పేస్ విభాగంలో మరిన్ని ఆప్షన్లు సిద్ధంగా ఉంచుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ వంటి పేసర్లతో పాటు అదనపు పేసర్ స్థానం కోసం ఆకాశ్ దీప్ కూడా పోటీలో ఉన్నాడు. అయితే అతడి ఎంపిక భవిష్యత్ ప్రదర్శన, ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది. ఇరానీ కప్‌లో ఆకాశ్ దీప్ ఎలా బౌలింగ్ చేస్తాడు? గాయం తర్వాత పూర్తి స్థాయి రిథమ్‌ను అందుకుంటాడా? సెలెక్టర్లను ఆకట్టుకుని న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకుంటాడా? ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టంతా ఈ పేసర్ రీఎంట్రీపైనే ఉంది.