భారత్‌కు కొత్త సవాల్

03-10-2026 | 05:21pm

న్యూఢిల్లీ, అక్టోబర్ 3 (విజయక్రాంతి): ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో(Financial Stability) అనిశ్చితి ఇక తాత్కాలిక పరిణామం కాదని, అది నిరంతరం కొనసాగుతున్న పరిస్థితిగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పేర్కొన్నారు. మారుతున్న అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొనేలా భారత్ తన విధానాలను రూపొందించుకోవాలని సూచించారు. ఢిల్లీలో జరుగుతున్న కౌటిల్య ఎకనామిక్ కాన్‌క్లేవ్‌లో మాట్లాడిన ఆమె.. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి నిరంతరంగా ఆర్థిక స్థిరత్వం, పెట్టుబడులు, పరిశోధన-అభివృద్ధి (R&D)పై దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత పారదర్శకంగా, ముందుగా అంచనా వేయగలిగేలా ఉండాలని నిర్మలమ్మ అభిప్రాయపడ్డారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత్ ముందస్తు సన్నద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో ప్రైవేట్ రంగ పెట్టుబడులు(Private sector investments) కీలక పాత్ర పోషించాలని, ముఖ్యంగా పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ప్రైవేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనిశ్చితిని ఎదుర్కోవడం ఒక్కసారిగా పూర్తయ్యే ప్రక్రియ కాదని, నిరంతరం కొనసాగాల్సిన ప్రయత్నమని ఆమె స్పష్టం చేశారు. రాబోయే సంవత్సరాల్లో ఎదురయ్యే సవాళ్లకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని సూచించారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్న వేళ, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి, పెట్టుబడుల వాతావరణం, గ్లోబల్ ఎకనామిక్ రిలేషన్స్(Global Economic Relations) వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చలు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు