ఓట్ల తొలగింపుపై ఈసీపై మేఘారెడ్డి ఫైర్

03-10-2026 | 06:00pm

వనపర్తిలో 35 వేలకుపైగా ఓట్లు తొలగించారని ఆరోపణ

సీఈ సీ రాజీనామాకు డిమాండ్‌.. దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపు

వనపర్తి టౌన్ : ఓటర్ల జాబితా(Voter List) సవరణ పేరుతో అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి(Wanaparthy MLA Tudi Megha Reddy) ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం వనపర్తి జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో అఖిలపక్ష నేతలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వనపర్తి నియోజకవర్గంలో సుమారు 2.75 లక్షల మంది ఓటర్లు ఉండగా.. 35 వేలకుపైగా ఓట్లను తొలగించారని మేఘారెడ్డి ఆరోపించారు. సర్ ప్రక్రియపై పారదర్శకత పాటించాలని, అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాలని కోరారు. సర్ లో పేర్లు గల్లంతైన అర్హులైన ఓటర్లను గుర్తించి తిరిగి జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం అన్ని పార్టీలను కలుపుకొని దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ప్రకటించారు. సమావేశంలో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, తెలంగాణ జన సమితి నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు