కోస్గి వెంకటయ్యకు డిప్యూటీ మేయర్ నివాళి
హన్వాడ : మండల పరిధిలోని వేపూర్ గ్రామానికి చెందిన కోస్గి వెంకటయ్య(Kosgi Venkatayya) ఇటీవల మృతి చెందగా, ఆయన పార్థివదేహానికి మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్(Mahabubnagar Municipal Corporation) డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి శనివారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో హన్వాడ మండల అధ్యక్షుడు వి. మహేందర్, డీసీసీ కార్యదర్శి జె. వెంకటయ్య, యాదయ్య, యదిరెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నివాళులర్పించారు.