ఇకపై లెక్క చూసుకోవాల్సిందే!

25-09-2026 | 08:30am

SBI కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ATM రూల్స్‌లో కీలక మార్పులు!

SBI కస్టమర్లు అక్టోబర్ 1, 2026 నుంచి కొన్ని ఏటీఎం క్యాష్ విత్ డ్రా నిబంధనలను గమనించాలి. ముఖ్యంగా Salary Package Account ఉన్నవారు ఇతర బ్యాంకుల ATMలు ఉపయోగించినప్పుడు ఉచిత లావాదేవీల సంఖ్య తగ్గనుంది. అదే సమయంలో ప్రాథమిక పొదుపు బ్యాంక్ డిపాజిట్ (Basic Savings Bank Deposit) ఖాతాలకు నగదు ఉపసంహరణ ఛార్జీల్లో మార్పు అమల్లోకి రానుంది. జీతాల ప్యాకేజీ ఖాతా (Salary Package Account) ఖాతాదారులు ఇతర బ్యాంకుల ATMలు, ADWMల వద్ద ప్రస్తుతం నెలకు 10 ఉచిత లావాదేవీలు చేసుకునే అవకాశం ఉండగా.. అక్టోబర్ 1 నుంచి ఈ పరిమితి 5 లావాదేవీలకు తగ్గుతుంది.

ఈ ఐదు లావాదేవీల్లో క్యాష్ విత్ డ్రాతో పాటు ఆర్థికేతర లావాదేవీలు కూడా లెక్కలోకి వస్తాయి. పరిమితి దాటితే నగదు ఉపసంహరణకు రూ.23 + GST, non-financial transactionకు రూ.11 + GST చార్జీ వర్తిస్తుంది. ఇక BSBD ఖాతాల విషయానికి వస్తే.. నెలలో మొదటి నాలుగు క్యాష్ విత్ డ్రాతో ఉచితంగానే ఉంటాయి. నాలుగు లావాదేవీలు దాటిన తర్వాత ప్రతి అదనపు cash withdrawalకు రూ.15 + GST చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పు Branch Channel ద్వారా తెరిచిన బీఎస్బీడీ ఖాతాలకు వర్తిస్తుంది. అయితే డిజిటల్ లావాదేవీలపై ఈ మార్పు ప్రభావం ఉండదు. SBI స్పష్టం చేసిన ప్రకారం డిజిటల్ ట్రాన్సాక్షన్లు ఎలాంటి పరిమితి లేకుండా ఉచితంగానే కొనసాగుతాయి. అందుకే అక్టోబర్ నుంచి ATM వినియోగించే ముందు మీ ఖాతా రకం, ఏటీఎం ఏది, నెలలో ఇప్పటికే ఎన్ని లావాదేవీలు చేశారో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

మరిన్ని వార్తలు