2030 నాటికి ‘జీరో పావర్టీ’

25-09-2026 | 05:10am
  1. 2033 వరకు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం
  2. కార్యాచరణ వేగవంతం చేయాలని నిర్ణయం  
  3. జిల్లాలవారీగా ప్రణాళికలకు రూపకల్పన 
  4. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం 

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రాన్ని దీర్ఘకాలిక అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణకు పదును పెట్టింది. 2030 నాటికి పేదరిక రహిత రాష్ట్రం, 2033 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించింది. అభివృద్ధి లక్ష్యాలను వేగంగా సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించారు.

అభివృద్ధి ప్రణాళికల అమలును మరింత బలోపేతం చేయడం, శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడం, ఫలితాలను నిరంతరం పర్యవేక్షిం చే వ్యవస్థల ఏర్పాటుపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ ఏర్పాటుచేయనున్నారు. ప్రాధా న్యతాభివృద్ధి కార్యక్రమాలకు వ్యూహాత్మక ప్రణాళిక, శాఖల మధ్య సమన్వయం, కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, పురోగతిని వేగవంతం చేయడం వంటి బాధ్యతలను పీఎంయూ నిర్వహించనుంది.

‘జీరో పావర్టీ’ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక, లక్ష్యిత కార్యక్రమాలను అమలు చేయనున్నారు. పేదరికానికి గురయ్యే కుటుంబాలను గుర్తించి, వారికి అం దాల్సిన వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేయడంతో పాటు స్థిరమైన జీవనోపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్ట నున్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వేగవంతమైన, కేంద్రీకృత అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించనున్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు, సమ్మిళి త అభివృద్ధికి కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా కార్యాచరణ రూపొందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థాగత సామర్థ్యాన్ని పెంచేందుకు వివిధ రంగాల్లో పరిజ్ఞానం కలిగిన నిపుణులు, కన్సల్టెంట్ల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు.

వ్యూహాత్మక ప్రణాళిక, డేటా ఆధారిత నిర్ణయాలు, సాంకేతిక పరిజ్ఞానం, నాలెడ్జ్ సపోర్ట్, సామర్థ్య నిర్మాణం, పర్యవేక్షణ, కీలక అభివృద్ధి కార్యక్రమాల వేగవంతమైన అమలుకు ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రస్థాయి అభివృద్ధి లక్ష్యాలను జిల్లాల స్థాయిలో కొలిచే వీలున్న ఫలితాలుగా మార్చేందుకు సమగ్ర జిల్లా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.  సమా వేశంలో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమా ర్ సుల్తానియా, ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌర వ్ ఉప్పల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు