7 September, 2026 | 7:08 AM

టెక్ హబ్‌గా తెలంగాణ

07-09-2026 | 05:35am
  1. ‘సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్’కు రోడ్ మ్యాప్
  2. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
  3. నీతి ఆయోగ్ సభ్యుడు సారస్వత్‌తో భేటీ
  4. క్వాంటం కంప్యూటింగ్‌లో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): అధునాతన ఫోటోనిక్ ప్యాకేజింగ్, కో-ప్యాకేజ్డ్ ఆప్టిక్స్ టెక్నాలజీలో తెలంగాణను కీలక కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu) స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా నిపుణులు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలతో కలిసి సమగ్ర కార్యచరణ ప్రణాళికను రూపొందించడంపై దృష్టి సారించామన్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు డా.వీకే సారస్వత్(NITI Aayog member Dr. V.K. Saraswat) ఆదివారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

సిలికాన్ ఫోటోనిక్స్ రంగంలోని అవకాశాలను తెలంగాణ అందిపుచ్చుకునేలా ‘తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్’ కు దశలవారీ వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఫోటో నిక్స్ వ్యాలీ కార్పొరేషన్ భవిష్యత్తు కార్యాచరణ, ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0తో ‘తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్’ను అ నుసంధానించే అవకాశాలపై సమీక్షించా రు. రాష్ట్రంలో పరిశోధన నుంచి వాణిజ్యస్థాయి తయారీ వరకు సమగ్ర సిలికాన్ ఫోటో నిక్స్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయడం, డిజైన్, పరిశోధన, తయారీ, ప్యాకేజింగ్, టెస్టింగ్, సరఫ రా వ్యవస్థల అనుసంధానంపై తమ అ భి ప్రాయాలను పంచుకున్నారు. 

పరిశోధన ఫలితాలను వాణిజ్యపరమైన సాంకేతిక పరి ష్కారాలు, ఉత్పత్తులుగా మలిచేలా పరి శ్ర మలు, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. త్వరలో ఏర్పాటు చేయనున్న ‘సెంట ర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్ క్వాంటం కంప్యూటింగ్’లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయాలని డా. వీకే సారస్వత్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు. ఫోటోనిక్స్, క్వాంటం కంప్యూటింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే అడ్వైజరీ కౌన్సిల్‌కు నేతృత్వం వహిం చాలని కూడా కోరారు.

ఫోటోనిక్స్, క్వాంటం కంప్యూటింగ్ లాంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని డా.వీకే సారస్వత్ పేర్కొన్నారు. ఈ రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, పరిశ్ర మల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు తనవంతు సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తానన్నారు. సమావేశంలో ఐటీఈ అండ్ సీ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, ఫోటోనిక్స్ వ్యాలీ కార్పొరేషన్ సీఈవో ఏఎస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు