ప్రమాదాల వల్ల ప్రాణ నష్టాలను తగ్గించాలి

24-10-2026 | 08:12pm

అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల(Road accidents) వల్ల కలిగే ప్రాణ నష్టాలను తగ్గించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) ఆదేశించారు. శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం ఆమె మాట్లాడుతూ, జిల్లాలో పీఎం రాహత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడేందుకు కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తమై, తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రమాద బాధితులకు అత్యవసర వైద్య సహాయం అందించడంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని, వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచుకుని ప్రాణ నష్టాలను సాధ్యమైనంత వరకు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పీఎం రాహత్ పథకం లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, ప్రమాద బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

మరిన్ని వార్తలు