ప్రజలకు మెరుగైన వైద్య సేవలకు మరో ముందడుగు!

24-10-2026 | 08:22pm

రామాయంపేటలో మెడ్‌ప్లస్ మెడికల్ షాప్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజ్..

రామయంపేట అక్టోబర్ 24(విజయక్రాంతి) : ప్రజల ఆరోగ్య అవసరాలకు అందుబాటులోనే ఔషధాలు లభించడం ఎంతో కీలకం. అనారోగ్యం వేళ మందుల కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గి, నాణ్యమైన ఔషధ సేవలు(Pharmaceutical Services) ప్రజలకు చేరువ కావాలనే ఆకాంక్షకు రామాయంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్‌ప్లస్ మెడికల్ షాప్(MedPlus Medical Shop) ప్రారంభం మరో ముందడుగుగా నిలిచింది.

 రామాయంపేట మున్సిపాలిటీ(Ramayampet Municipality) పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్‌ప్లస్ మెడికల్ షాప్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పట్టణంలో ప్రజలకు అవసరమైన వైద్య సేవలకు అనుబంధంగా మెడికల్ షాపులు అందుబాటులో ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ప్రజల దైనందిన ఆరోగ్య అవసరాలకు మందులు సులభంగా అందుబాటులో ఉండేలా ఇలాంటి సంస్థలు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పోచమ్మల నవనీత గణేష్, కౌన్సిలర్లు బైరం స్వప్న కుమార్, పుట్టి సందీప్, దేవుని రంజిత్, డాకి శ్యామల స్వామి, కో-ఆప్షన్ సభ్యురాలు చింతల రాధా భవాని యాదగిరి, దేమే యాదగిరి, గౌస్, మైనారిటీ పట్టణ అధ్యక్షుడు తాహీర్, యువ నాయకులు సాయి సుధీర్ గౌడ్, నరేందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు చేరువలో వైద్య సేవలు.. ఆరోగ్యంపై భరోసా!

పట్టణంలో వ్యాపార సంస్థల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన సేవలు విస్తరించడం స్థానికంగా సానుకూల పరిణామం. మెడ్‌ప్లస్ మెడికల్ షాప్ ప్రజలకు నాణ్యమైన ఔషధాలు, మెరుగైన సేవలు అందిస్తూ వారి ఆదరణ పొందాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆకాంక్షించారూ.

మరిన్ని వార్తలు