ఐఫోన్ యూజర్లకు హెచ్చరిక

29-11-2026 | 01:38pm

ఐఫోన్‌లో సైలెంట్‌గా చొరబడుతున్న హ్యాకర్లు.. ఈ తప్పు చేయొద్దు!

మీ చేతిలో ఐఫోన్ ఉందా? అయితే ఈ హెచ్చరికను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎలాంటి అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేయకపోయినా, తెలియని యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోకపోయినా ఫోన్ హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని టెలిగ్రామ్ CEO పావెల్ దురోవ్(Telegram CEO Warns iPhone Users) హెచ్చరించారు. ముఖ్యంగా పాత iOS వెర్షన్లు ఉపయోగిస్తున్న ఐఫోన్ యూజర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం Social Mediaలో చర్చనీయాంశంగా మారాయి.

పాత iOS సాఫ్ట్‌వేర్‌లో ఉండే భద్రతా లోపాలను (Security Vulnerabilities) హ్యాకర్లు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని దురోవ్ పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైన వెబ్‌సైట్‌ను కేవలం ఓపెన్ చేసినంత మాత్రాన కూడా సైబర్ దాడికి గురయ్యే ముప్పు ఉంటుందని హెచ్చరించారు. ఇలాంటి దాడుల ద్వారా ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం, ఇతర కీలక డేటాను హ్యాకర్లు దొంగిలించే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఏయే iOS వెర్షన్లలో ఈ సమస్య ఉందో, ఎంతమంది యూజర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందో ఆయన స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు.

మరోవైపు ఇటీవల పలు ప్రముఖ వెబ్‌సైట్లపై కూడా Cyber Attacks జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. నవంబర్ 17న సుమారు 178 వెబ్‌సైట్లలో ప్రమాదకరమైన కోడ్ గుర్తించినట్లు సమాచారం. వీటిలో Zoom, HSBC, CNN, Salesforce, IKEA వంటి ప్రముఖ సంస్థలకు సంబంధించిన వెబ్‌సైట్లు కూడా ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ దాడుల ద్వారా యూజర్ల Bank Details, Login Credentials, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ఐఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి:

- ఫోన్‌లో ఎప్పటికప్పుడు Latest iOS Update ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

- Settingsలో Generalకు వెళ్లి Software Updateను చెక్ చేయాలి.

- Automatic Updates ఆప్షన్‌ను ఆన్‌లో ఉంచుకోవాలి.

- అనుమానాస్పద, తెలియని వెబ్‌సైట్లను ఓపెన్ చేయకుండా ఉండాలి.

- తెలియని యాప్స్, ప్రొఫైల్స్‌ను ఇన్‌స్టాల్ చేయకూడదు.

- అనుమానాస్పద లింక్స్, మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

సాధారణంగా ఫోన్‌ను అప్‌డేట్ చేయడం చిన్న విషయంగానే అనిపించినా.. సైబర్ నేరాల నుంచి రక్షణ పొందడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఐఫోన్ యూజర్లు తమ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను వెంటనే చెక్ చేసుకుని, అవసరమైన Security Updates ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిది.

మరిన్ని వార్తలు