కలెక్టరేట్‌లో రైతు ఆత్మహత్యాయత్నం

23-11-2026 | 05:46pm

భూ వివాదం (Land Dispute) పరిష్కరించాలని కోరుతూ ఓ రైతు కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి (Public Grievance) కార్యక్రమానికి వచ్చిన బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు దేవన్న.. కలెక్టరేట్ ఆవరణలో పురుగుల మందు తాగారు.

తన భూ సమస్యను అధికారులు పరిష్కరించడం లేదనే ఆవేదనతో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు (Police), స్థానికులు రైతును చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్య చికిత్స (Medical Treatment) అందిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజావాణిలో సమస్య పరిష్కారం కోసం వచ్చిన రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు