బిఆర్ఎస్ పాలనలోని విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం
రాజాపూర్ నవంబర్ 23 : బిఆర్ఎస్ పాలనలో పాఠశాల భవనాలే(School buildings) మంజూరు కాలేదని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(MLA Anirudh Reddy) మాట్లాడటం బాధ్యతారహితమని బిఆర్ఎస్ పార్టీ(BRS Party) మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే మాట్లాడిన వాక్యలకు బిఆర్ఎస్ పార్టీ నాయకుల స్పందించి మండలంలోని వివిధ గ్రామాలలో గత ప్రభుత్వం మంజూరు చేసిన నిర్మించిన పాఠశాలలను పరిశీలించారు.
అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని పాఠశాలలో అభివృద్ధి పనులు జరగడంతో పాటు కొత్త భవనాలను నిర్మించారని తెలిపారు. ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న పాఠశాల భవనాలే అందుకు నిదర్శనమని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలోనే కేసీఆర్ ఎన్నో గురుకుల పాఠశాలలను నిర్మించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు నర్సింలు, సుశీల రమేష్ నాయక్, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు బచ్చిరెడ్డి, ఆర్ యాదగిరి, సత్తయ్య, శ్రీనివాస్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.