ఈ నెల 29న సీనియర్ కబడ్డీ బాలురు జట్టు ఎంపికలు

23-11-2026 | 05:43pm

తాడ్వాయి,నవంబర్,23(విజయ క్రాంతి): ఈ నెల 29న 73వ సీనియర్ కబడ్డీ బాలురు జట్టు(Senior Kabaddi Boys Team) ఎంపికలు నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్(District Kabaddi Association) ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజన్న తెలిపారు. సదాశివ నగర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల మైదానంలో ఉదయం 10:30 గంటలకు ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సీనియర్ కబడ్డీ బాలురు జట్టు విభాగంలో పాల్గొనే క్రీడాకారులు 85 కేజీల బరువు కలిగి ఉండాలన్నారు.మ్యాట్ షూస్, డ్రెస్ కోడ్ తో ఎంపికులకు రావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, చైర్మన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు