తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో రైతు మృతి
భూ సమస్య కారణమా మరేదైనా ఉందా?
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కోయిల్‌కొండ: మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar District) కోయిల్‌కొండ తహశీల్దార్ కార్యాలయ(Koilkonda Tahsildar Office) ఆవరణలో ఓ రైతు చెట్టుకు వేలాడుతూ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పారుపల్లి గ్రామానికి చెందిన రైతు లవప్ప (Farmer) కార్యాలయ ప్రాంగణంలోని ఓ చెట్టుకు ఉరేసుకుని శనివారం తెల్లవారుజామున కనిపించారు. బాధితుడు తన భూమికి సంబంధించిన సమస్యను పరిష్కరించుకునేందుకు గత కొద్ది రోజులుగా స్థానిక ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు వారు చెబుతుండ్రు.
ఎన్నిసార్లు అధికారులను ఆశ్రయించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురి అయ్యారా? మరి ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా? తెలియాల్సి ఉంది. ఈ విషయంపై ఎస్సై నాగరాజు స్పందిస్తూ రైతు తెల్లవారుజామున ఉదయం 5:30 గంటల సమయంలో చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతి చెందిన రైతు భూమికి వివాదానికి సంబంధించి కోర్టు పరిధిలో ఉన్న కారణంగా భూ పరిష్కారం కాలేదని తెలుస్తుంది. ఈ విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటమని ఎస్ఐ నాగరాజు తెలిపారు.