రైతులకు శెనగ, తెల్ల కుసుమ విత్తనాల పంపిణీ
- 25 కిలోల శెనగ విత్తనాల బ్యాగు రూ.1,500కు పంపిణీ
- సేంద్రీయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలి: ఆత్మ చైర్మన్ వినోద్ పాటిల్
నాగల్గిద్ద,(విజయక్రాంతి): నాగల్గిద్ద మండలంలోని రైతు వేదికలో నారాయణఖేడ్ ఆత్మ కమిటీ(Narayankhed ATMA Committee) చైర్మన్ వినోద్ పాటిల్ ఆధ్వర్యంలో యాసంగి సాగు(Rabi Season Cultivation)కు సంబంధించి రైతులకు శెనగ, తెల్ల కుసుమ విత్తనాలను పంపిణీ చేశారు. రైతులకు 25 కిలోల శెనగ విత్తనాల బ్యాగును రూ.1,500కు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ వినోద్ పాటిల్(ATMA Committee Chairman Vinod Patil) మాట్లాడుతూ రైతులకు మేలు చేసే విషయంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు.
రైతులు నూతన వ్యవసాయ విధానాలను అందిపుచ్చుకోవడంతో పాటు సేంద్రీయ సాగు పద్ధతులను పాటించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.ఇన్చార్జి సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రవీణ్ చారి మాట్లాడుతూ 25 కిలోల శెనగ విత్తనాల బ్యాగును రూ.1,500కు అందిస్తున్నామని తెలిపారు. అలాగే 15 కిలోల శనగ తెల్ల కుసుమ విత్తనాల బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, వాటి ధరను త్వరలో నిర్ణయించి రైతులకు తెలియజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఈఓలు మహిపాల్, చరణ్, గ్రామాల సర్పంచులు, లక్ష్మణ్ శివశర్ణప్ప, బస్వరాజ్ రైతులు తదితరులు పాల్గొన్నారు.