బాధితులకు అండగా వెడ్మ ఫౌండేషన్

03-10-2026 | 05:09pm

ఉట్నూర్,(విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలం(Indravelli Mandal) తుమ్మగూడ గ్రామానికి చెందిన కొడప జంగు  ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్  స్పందించి, జంగు భార్య యశోద కు వెడ్మ ఫౌండేషన్(Vedma Foundation) ద్వారా రూ.10,000 వెడ్మ ఫౌండేషన్ సభ్యులు మెస్రం నగేష్ ఆర్థిక సహాయం అందించారు. భర్తను కోల్పోయిన కుటుంబానికి, ఇద్దరు చిన్నారులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel)  కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు