పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలాధారం

03-10-2026 | 05:13pm

మందమర్రి, (విజయక్రాంతి): పరిశుభ్రతను(Cleanliness) ప్రతి ఒక్కరూ నిత్యకృత్యంగా మార్చుకోవాలని మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ(Mandamarri Area GM N. Radhakrishna) పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా(Mancherial District) మందమర్రి జీఎం కార్యాలయ ఆవరణలో శనివారం నిర్వహించిన ‘స్పెషల్ క్యాంపెయిన్–6 స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ(Mahatma Gandhi) కలలుగన్న స్వచ్ఛ భారతాన్ని సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.

పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులను నివారించడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించవచ్చన్నారు. ప్రతి వారం కనీసం రెండు గంటలు శ్రమదానం చేసి ఇల్లు, పరిసరాలు, కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రమైన పని వాతావరణంతో ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకత మెరుగుపడుతుందని తెలిపారు. అనంతరం అధికారులు, ఉద్యోగులతో స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు