తెన్‌కాశిలో తప్పిన ఘోరప్రమాదం.. ఎలా జరిగిందంటే.?
13-09-2026 | 01:09pm
తెన్‌కాశి: తమిళనాడులోని(Tamil Nadu) తెన్‌కాశిలో ఆదివారం ఘోర ప్రమాదం తప్పింది. తెన్‌కాశి నుంచి తిరునెల్వేలికి(Tenkasi to Tirunelveli) వెళ్తున్న ప్రభుత్వ బస్సు వెట్టైక్కారన్‌కులం సమీపంలో వంతెన రక్షణ గోడను ఢీకొని అలుతకన్ని నదిలో(Aluthakanni River) పడింది. కాలువలో నీళ్లు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రక్షణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు గాయపడగా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.