బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్

25-11-2026 | 01:53pm

సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ (Food Poisoning) కలకలం రేపింది. హాస్టల్‌లో భోజనం వికటించడంతో పలువురు విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పురుగులు పడిన అన్నం (Contaminated Food) పెడుతున్నారంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటన వెలుగులోకి రాకుండా సిబ్బంది హాస్టల్ తలుపులు మూసివేసి, మిగిలిన ఆహారాన్ని పారబోసి, వంట పాత్రలను శుభ్రం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. విషయం తెలుసుకున్న తహసీల్దార్, ఎస్‌ఐ హాస్టల్‌కు చేరుకుని తలుపులు తీయాలని కోరారు. అయినప్పటికీ సిబ్బంది సుమారు అరగంట వరకు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై (Health Condition) ఆందోళన వ్యక్తమవుతోంది. హాస్టల్‌లో ఆహార నాణ్యత, నిర్వహణ తీరుపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు