గ్రామంలో 22 సీసీ కెమెరాల ఏర్పాటు.
శివంపేట్, నవంబర్ 25 (విజయక్రాంతి): మెదక్ జిల్లా శివంపేట మండలంలోని పెద్దగొట్టిముక్ల గ్రామంలో భవ్యస్ ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (Company), గ్రామ పంచాయతీ సంయుక్త ఆధ్వర్యంలో 22 సీసీ కెమెరాలు (CCTV Cameras) ఏర్పాటు చేశారు. బుధవారం స్థానిక ఎస్సై మధుకర్ రెడ్డి, ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ, గ్రామ సర్పంచ్ ఎం. నవీన్ వాటిని ప్రారంభించారు.
గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ (Security), దొంగతనాల నివారణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు తెలిపారు. ప్రజల భద్రత (Public Safety)ను దృష్టిలో ఉంచుకుని కెమెరాల ఏర్పాటుకు సహకరించిన కంపెనీ యాజమాన్యాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు కిరణ్ కుమార్, సాయిరాం రెడ్డి, ఎంపీఓ తిరుపతిరెడ్డి, ఉపసర్పంచ్ అల్లాడి ఆంజనేయులు, వార్డు సభ్యులు బేరి సాయికుమార్, కాళ్ల హరీష్, గుండ లక్ష్మణ్, మంత్రి వైష్ణవి ఎలెండర్, చాకలి లక్ష్మీ నగేష్, అల్లాడి వీరేశం, చేగురి లత, లాలల నవీన్, నాయకులు చేత్రి గణేష్, మంగలి ఆంజనేయులు, ప్రభాకర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, కానిస్టేబుల్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.