ఎల్లుండి నుంచే ఇందిరమ్మ చీరలు పంపిణీ

24-11-2026 | 11:41am

తెలంగాణలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఎల్లుండి అచ్చంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించనున్నారు. ఇప్పటికే పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని 64 లక్షల మంది, పట్టణ ప్రాంతాల్లోని 35 లక్షల మంది మహిళలకు చీరలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మొత్తం కోటి మంది మహిళలను దృష్టిలో ఉంచుకుని చీరలను సిద్ధం చేసింది.ఈ పథకం (Scheme) కోసం చిలుకపచ్చ రంగులో 6.30 మీటర్ల పొడవు కలిగిన 95 లక్షల పాలిస్టర్ చీరలను తయారు చేయించారు. వీటితో పాటు 9 మీటర్ల పొడవు కలిగిన 5 లక్షల పాలీకాటన్ చీరలను కూడా పంపిణీ చేయనున్నారు.

ఎవరెవరికి అర్హత?

రేషన్ కార్డు (Ration Card) కలిగి ఉండి, 18 ఏళ్లు నిండిన మహిళలందరూ ఇందిరమ్మ చీరలు పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. 

మరిన్ని వార్తలు