అర్ధరాత్రి మేడ్చల్‌లో మంటలు

04-10-2026 | 07:35am
మేడ్చల్ చెక్‌పోస్ట్‌ (Check Post) వద్ద అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. చెక్‌పోస్ట్‌ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఫర్నిచర్‌ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండు ఫర్నిచర్‌ షాపుల్లో మంటలు భారీగా ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పక్కనే ఉన్న మరికొన్ని దుకాణాలకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌ సిబ్బంది (Fire Team) ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. కొంతసేపటి తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదంలో రెండు ఫర్నిచర్‌ దుకాణాల్లోని ఫర్నిచర్‌ (Furniture), ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. భారీగా ఆస్తి నష్టం (Property Loss) జరిగినట్లు బాధిత దుకాణాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు (Investigation) చేపట్టే అవకాశం ఉంది. నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు