గుడుంబా మత్తుకు ప్రాణం బలి.. అధికారులది నిర్లక్ష్యమేనా?
కన్నాయిగూడెం, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గూర్రేవుల గ్రామంలోని తాటిచెట్ల వద్ద (చిట్యాల మూలమలుపు) రాజన్నపేట గ్రామపంచాయతీకి చెందిన ఓ వ్యక్తి గుడుంబా మత్తులో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. (Liquor-Related Death) దసరా పండుగ సందర్భంగా గూర్రేవుల గ్రామంలో మూడు, నాలుగు రోజులుగా గుడుంబా సేవిస్తూ ఇంటికి వెళ్లకుండా గ్రామంలో తిరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
మృతిపై సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో విచ్చలవిడిగా గుడుంబా అమ్మకాలు (Illegal Liquor Sales) సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో పడి అక్రమ అమ్మకాలను అడ్డుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గుడుంబా అమ్మకాలను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఘటనపై అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు (Official Action). గ్రామంలో అక్రమ మద్యం విక్రయాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు (Liquor Control).