యాదాద్రి ప్లాంట్ మరో ముందడుగు
- గ్రిడ్‌కు అనుసంధానమైన ఐదో యూనిట్
- కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం: బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్(Yadadri Thermal Power Plant) మరో కీలక మైలురాయిని అధిగమించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్లాంట్‌లో 800 మెగావాట్ల సామ ర్థ్యం కలిగిన ఐదో యూనిట్‌ను విజయవంతంగా గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్లు తెలి పారు. తెలంగాణ విద్యుత్ రంగంలో ఇది మరో కీలక ముందడుగని అభివర్ణించారు.
మాజీ సీఎం కేసీఆర్ దార్శనికతతో రూపుదిద్దుకున్న యాదాద్రి ప్రాజెక్టు మొత్తం 4,000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మితమవుతోందని ఆయన పేర్కొన్నారు. ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)కు రూ.20,400 కోట్ల విలువైన ఆర్డర్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చిన మార్పునకు యాదాద్రి ప్లాంట్ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. 2014లో తెలంగాణ ఏర్పడిన సమయంలో రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లుగా ఉండేదని, దశాబ్ద కాలంలో అది దాదాపు 20,000 మెగావాట్లకు చేరిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ వృద్ధి కేసీఆర్ దార్శనికత, విద్యుత్ రంగ అభివృద్ధిపై ఆయన పెట్టిన దృష్టికి నిదర్శనమని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.