ఆయా షేర్ పాటకు సీపీ సజ్జనార్ స్టెప్పులు

26-09-2026 | 03:14pm

ప్యారడైజ్‌లో పాటకు స్టెప్పులేసిన సీపీ సజ్జనార్

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన(Ganesh Immersion) వేడుకలు ప్రశాంతంగా ముగిసిన అనంతరం సందడి వాతావరణం నెలకొంది. నిమజ్జన కార్యక్రమాల పర్యవేక్షణలో బిజీగా ఉన్న సీపీ సజ్జనార్.. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్యారడైజ్‌లో ‘ఆయా షేర్’ పాటకు సీపీ సజ్జనార్(CP Sajjanar) స్టెప్పులేశారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన డ్యాన్స్ చేయడంతో అక్కడి వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది.

నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన పోలీస్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు ఈ సందర్భంగా సందడి చేశారు. సీపీ సజ్జనార్ కూడా వారితో కలిసి ఉత్సాహంగా పాల్గొని స్టెప్పులు వేయడం అక్కడ ఉన్నవారిని ఆకట్టుకుంది.నిమజ్జన ఏర్పాట్లలో ఉదయం నుంచి రాత్రి వరకు విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి సీపీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. అనంతరం ఉత్సాహంగా జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


మరిన్ని వార్తలు