శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

19-09-2026 | 06:16am

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్(Shamshabad)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. డ్రైవర్ అశోక్ కు తీవ్రగాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. మృతులను మహబూబ్ నగర్ జిల్లా(Mahabubnagar District) చౌడూర్ కు చెందిన కేతావత్ లింబ్య, కేతావత్ జమున, కేతావత్ మాన్ సింగ్, కేతావత్ వాస్రామ్ గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు మార్చురీకి తరలించారు. 

మరిన్ని వార్తలు