తెలంగాణను కేంద్రం ఆదుకోవాలి
- అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
- రాష్ట్రంపై ఎల్ నినో ప్రభావం
- లోటు వర్షపాతంతో సంక్షోభం
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాం తి) : ఎల్ నినో ప్రభావం(Impact of El Nino), రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం(Central Government) తెలంగాణను ఆదుకోవాలని రాష్ట్ర ప్ర భుత్వం కోరింది. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) సభలో తీర్మానం ప్ర వేశపెట్టారు. 2026 జూన్ 1 నుంచి సెప్టెంబర్ 16 వరకు రాష్ట్రంలో సాధారణంగా కుర వాల్సిన 664.5 మి.మీ. వర్షపాతానికి 536. 5 మి.మీ. మాత్రమే నమోదైందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 19 జిల్లాలు వర్షాభావ కేటగిరీలో ఉన్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావం నెలకొందన్నారు. వానాకాలం సాధారణ పంటల సాగు విస్తీర్ణం 139.29 లక్షల ఎకరాలుంటే, కేవలం 88 శాతం విస్తీర్ణంలోనే పంటలు సా గయ్యాయన్నారు. వరి సాగు విస్తీర్ణం దాదా పు 18 శాతం తగ్గిందన్నారు. పంట మొలకెత్తకపోవటం, పలుమార్లు విత్తనాలు వేయా ల్సి రావటంతో రైతులు, కౌలు రైతులపై పె ట్టుబడి భారం ఎక్కువైందన్నారు. ‘2026 సెప్టెంబర్ 15 నాటికి రాష్ట్రంలోని ప్రధాన జ లాశయాల్లో 585 టీఎంసీల సామర్థ్యానికి గాను 241 టీఎంసీల లైవ్ స్టోరేజ్ మాత్రమే ఉంది.
గత ఏడాది ఇదే రోజున 497 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. ప్రాజెక్టుల్లో నీటి మట్టం తగ్గటంతో, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు రిజర్వు చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడున్న నీటి నిల్వలు యాసంగి పంటలకు సాగునీటి ని అందించేందుకు సరిపోవు. భూగర్భ జలా లు తగ్గటం, చెరువులు, కుంటల్లో ఆశించిన నీటి లభ్యత లేనందున తాగునీటి కొరత తలె త్తే అవకాశముంది..’ అని సభకు వివరించా రు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్ర భుత్వానికి కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ స హకారాలను అందించాల్సిన అవసరముందన్నారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన ని ధి (ఎస్‌డీఆర్‌ఎఫ్ )లో కేంద్ర వాటాను సత్వరమే విడుదల చేయాలని కోరారు. ఈ తీర్మా నంపై సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
అసెంబ్లీలో మరికొన్ని తీర్మానాలు
౧. పంట నష్టం/ఇన్‌పుట్ సబ్సిడీ, తాగునీరు, పశుగ్రాసం, పశు సంపద పరిరక్షణ, భూగర్భ జలాలు, చెరువులు, ఇతర జలవనరుల పునరుద్ధరణతో పాటు ఉపశమన చర్య లకు సాయం అందించాలి. అందుకు వీ లు గా నిబంధనలు సడలించాలి.
౨. వీబీజీ రామ్‌జీ పథకంలో 125రోజుల ఉపాధికి అదనంగా మరో 50 రోజుల ఉపా ధి కల్పించాలి. వ్యయాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించాలి. రాష్ట్రంలో అమల్లో ఉన్న 60 రోజుల సీజనల్ సస్పెన్షన్ కాలాన్ని సడలించాలి. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి భద్ర త కల్పించేందుకు లేబర్ బడ్జెట్‌ను తగినంతగా పెంచాలి.
౩. రాష్ట్రానికి అవసరమైన ఎరువులను తగినంతగా, సకాలంలో కేటాయించాలి. ప్ర భావిత జిల్లాలకు ముందుగానే రేక్ల ద్వారా సరఫరా చేయాలి. పర్ డ్రాప్ మోర్ క్రాప్ (పీడీఎంసీ) కింద కేటాయింపులను పెంచి డ్రిప్ ఇరిగేషన్ను వేగంగా విస్తరించాలి. మిషన్ ఫర్ ఇంటిగ్రేటేడ్ డెవెలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ్) కింద కూరగాయల సా గు విస్తీర్ణం పెంపునకు ఆర్థిక సహాయం అం దించాలి. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయాలి.
౪. తెలంగాణకు అదనంగా 1,500 మెగావాట్ల విద్యుత్తు కేటాయించాలి. కేంద్ర విద్యు త్ ఉత్పత్తి సంస్థల్లో కేటాయించకుండా ఉన్న కోటా నుంచి దీన్ని అందించాలి. విండో--1 కింద 5 మిలియన్ టన్నుల బొగ్గు లింకేజీ ని ర్ధారించి రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రేకుల లభ్యతను పెంచాలి. విద్యుత్తు ట్రాన్స్ మిషన్ ఛార్జీలను సడలించి, అవసరమైన సాయం అందించాలి.
౫. తాగు, సాగు నీటి అవసరాలు, కరువు నివారణ చర్యలకు కేంద్రం రూ.20 వేల కో ట్ల ప్యాకేజీ మంజూరు చేయాలి. చెరువులు, నీటి వనరుల పునరుజ్జీవనం, పురోగతిలో ఉన్న సాగునీటి ప్రా జెక్టులను వేగంగా పూర్తి చేయడానికి వివిధ కేంద్ర పథకాల కింద తగిన సహాయం అం దించాలి.
౬. 2026--27 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్‌ఆర్బీఎం రుణ పరిమితిని జీఎస్డీపీలో 3 శా తం నుంచి 3.5 శాతానికి పెంచాలి. తద్వారా ఉపశమన, నివారణ చర్యలకు అవసరమైన అదనపు వ్యయాన్ని రాష్ట్రం భరించేందుకు అవకాశం కల్పించాలి.
౭. రైతులు, బలహీన వర్గాల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు తక్షణ సహాయ చర్యలు చేపట్టేందుకు కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అదనపు ఆర్థిక సాయం అందించాలి. అందుకు అవసరమైన తీరుగా నిబంధనలను సడలించాలి.