బయటికి వచ్చిన బాధితులు!
- తమను వేధిస్తున్న సీవోపై చర్యలకు డిమాండ్
- మాట వినకుంటే కనుమరుగు చేస్తాడట..
- మెప్మాలో తన మాటే నడుస్తుందని హడల్
- యాదయ్యపై కలెక్టర్కు మహిళల ఫిర్యాదు
మహబూబ్ నగర్ సెప్టెంబర్ 18 (విజయక్రాంతి) : మెప్మా(MEPMA)లో కమ్యూనిటీ ఆర్గనైజర్(Community Organizer) పనిచేస్తోన్నా యాదయ్య(Yadaiah) అనే వ్యక్తి తమ ను గత 15ఏళ్లుగా నిత్యం వేధిస్తూ, నానా ర కాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అతని బాదితులు రిసోర్స్పర్సన్స్, మహిళా సంఘ(Resource persons, womens organizations) సభ్యులు మూకుమ్మడిగా బయటకు వ చ్చి శుక్రవారం జిల్లా కలెక్టర్కు పిర్యాదు చేశా రు. గత కొంత కాలంగా మహిళల్ని భయబ్రాంతులకు గురిచేస్తూ వారిపై నియంత పా లన సాగించడమే కాకుండా, వారిని నిత్యం వేధింపులకు గురిచేస్తోన్నా యాదయ్యపై ఇక కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని వారంతా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు.
తాము యాదయ్యపై ఎప్పుడు పిర్యాదు చేసినా, తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మళ్లీ యదావిధిగా కొనసాగి మాపై రక రకాల దాడులకు పాల్పడుతున్నాడని వారంతా ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ విషయమై బాదితులు అధికారులకు పిర్యాదు చేస్తే వారిపై రక రకాల నిందలు వేయించి వారిని మెప్మాలో ఉండకుండా చేస్తున్నాడని వారు చెబుతున్నాడు. మహిళలు పనిచేసే చోట ఇలాంటి నియంత ఉద్యోగి యాదయ్య కొనసాగడమేంటని వారంతా ప్రశ్నిస్తున్నారు.
మేము పడుతోన్నా బాధల్ని ఎవ్వరికి చెప్పిన వారు మళ్లీ యాదయ్యకు చెప్పి అతనికి సపోర్ట్ నిలువడంతో ఇన్నాళ్లు భరిస్తూ వచ్చామన్నారు. కానీ మా బాధల్ని విజయక్రాంతి దృష్టికి తీసుకవచ్చాం. పాలమూర్ మెప్మా లో నేనే బాస్’ ఇక్కడ నాదే పెత్తానం’ అనే కథనంతో గత కొద్ది రోజులుగా వెలుగుల్లోకి తీసుకరావడంతో ఇప్పుడు మాకు కొంత ధైర్యం వచ్చిందన్నారు. ఆ వెంటనే మేమం తా మూకుమ్మడిగా ముందుకు వచ్చి ఈరో జు జిల్లా కలెక్టర్కు పిర్యాదు చేసి అతని అరాచకాలను వివరించామన్నారు.
అతని ఇక్కడి నుండి తొలగిస్తే అతని బాధితులు పెద్ద సంఖ్యలో ముందుకు రావడమే కాకుండా, అతడు చేసిన అవకతవకలన్నీ బయటపడతాయంటూ కలెక్టర్కు వివరించామన్నారు. ఇక ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందించడంలో తాము కృషి చేస్తుంటే యాదయ్య మాత్రం తనకు అనుకూలంగా ఉన్నా వారికి వాటిని అందంచేందుకు కృషిచేస్తున్నారని వారు ఆవేదనను వ్యక్తం చేశా రు. ఇదేమని ఎవ్వరైన అడిగితే వారిని నానా రకాల ఇబ్బందులకు గురిచేస్తాడని, ఈ కారణంగా తాము ఇన్నాళ్లు ఎవ్వరికి చెప్పు కోలేకపోయ్యామన్నారు.
మహిళల్ని లెక్కచెయ్యడు...
ప్రభుత్వం మహిళా సంఘాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుంటే పాలమూర్ పట్టణంలో మాత్రం యాదయ్య మహిళలని చూడడు, మేము వయస్సులో పెద్దవారమని కూడా చూడకుండా హేళన చేస్తున్నాడని వారు తెలిపారు. ఇక రక రకాల కారణాలతో మాపై చేస్తోన్నా వేధింపులు ఎవ్వరికి చెప్పుకోలేనివిగా మారాయని, ఎవ్వరికైనా చెప్పుకొంటే మమ్మల్ని కనుమరుగు చేస్తానని భయపెడతాడంటూ వారంతా వాపోయ్యారు.
ఏ సమావేశంలో నూ మహిళలను మాట్లాడనివ్వకుండా అంతా యాదయ్యనే నోరు పెద్దగా చేసి అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి తనే గొప్ప అని చెబుతూ, మహిళలను చేతగాని వారిగా చేస్తున్నాడట. ఇదేమని అడిగితే కలెక్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా వారికి నేను చెప్పిందే వేదమని మీరు చూశారుగా, ఎవ్వరైనా నాపై పిర్యాదు చేస్తే మిమ్మల్ని కనుమరుగు చేసి మీ అంతు చూస్తానని బెదిరిస్తున్నాడని వారు చెబుతున్నాడు.
మెప్మాలో నా ప్రభుత్వమే..
అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా మెప్మాలో మాత్రం నా ప్రభుత్వమే నడుస్తోందన్న విషయాన్ని గుర్తించుకోవాలని యాదయ్య మహిళలను భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు వారు తెలిపారు. ఇక ఇటీవలె అతన్ని సస్పెండ్ చేస్తే మళ్లీ వెంటనే విధుల్లోకి వచ్చి మాపై విరుచుకుపడుతున్నాడని వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని వేధిస్తూ, అతని ప్రభుత్వమని ముద్ర వేసుకొంటూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నాడని, వెంటనే స్పందించి అతనిపై అతని ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకొని మాకు విముక్తి కల్పించాలని కలెక్టర్ని కోరగా, వెంటనే విచారణ చేసి కఠిన చర్యలు తీసుకొంటానని కలెక్టర్ చెప్పారని వారు తెలిపారు.
ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు..
సిఓ యాదయ్య పై జిల్లా కలెక్టర్ మహిళలు చేసిన ఫిర్యాదు నా దృష్టికి వచ్చింది. మున్సిపల్ కమిషనర్ ఆదేశాలను పాటిస్తాం. సిఓ పై చర్యలు తీసుకునేది తీసుకోకూడదు నా పరిధిలో లేదు.. పూర్తి అధికారం మున్సిపల్ కమిషనర్ కు ఉంటుంది. వారిని అడిగి తదుపరి చర్యలు తీసుకుంటాం.
ఎండీ యూసఫ్, మెప్మా పీడీ,
మహబూబ్ నగర్