జీహెచ్‌ఎంసీ బకెట్ ల్యాడర్ టెండర్లలో హడావిడి

19-09-2026 | 05:25am

 24 గంటల్లోపే ప్రక్రియ ఖరారు?

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(Greater Hyderabad Municipal Corporation) (జీహెచ్‌ఎంసీ)లో చెట్ల కొమ్మల తొలగింపు (ట్రీ ప్రూనింగ్)(Tree Pruning) కోసం ఉద్దేశించిన స్కై బకెట్ ల్యాడర్ల(sky bucket ladders) టెండర్ల ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. 12 నెలల సుదీర్ఘ కాలపరిమితి ఉన్న కాంట్రాక్టు(Contract)కు అత్యవసర నిబంధనలు వర్తింపజేస్తూ, కేవలం 24 గంటల వ్యవధిలోనే ప్రక్రియను మమ అనిపించడంపై కాంట్రాక్టర్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా ఎం పిక చేసిన కొద్దిమందికి ప్రయోజనం చేకూర్చేందుకే అధికారులు ఈ నిర్ణయం తీసుకు న్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గడువు కుదింపు...

అత్యవసర పనులకైనా కనీసం 72 గంటల సమయం ఇవ్వాల్సి ఉండగా, ఖైరతాబాద్, గోల్కొండ జోన్లలో టెండర్ అప్లోడ్ చేసిన ఒక్క రోజులోనే ముగించారు. ఒక్కో వాహనానికి ఏడాదికి రూ.27.94 లక్షల అంచనా వ్యయంతో కాంట్రాక్టులు రూపొందించినా, అర్హత గల బిడ్డర్లకు డాక్యుమెంట్లు సమర్పించే సమయం ఇవ్వలేదు. సికింద్రాబాద్ జోన్లో టెండర్లకు 6 రోజుల సమయ మివ్వగా, ఇతర జోన్లలో 24 గంటల్లోనే ము గించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిబంధనల ఉల్లంఘన

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లో వాహన సామర్థ్యం, జీపీఎస్ వంటి స్పష్టమైన నిబంధనలతో తగిన సమయమిచ్చి టెండర్లు నిర్వహించగా, జీహెచ్‌ఎంసీలో మాత్రం పారదర్శకత లోపించింది.పోటీ తగ్గడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఈ టెండర్లపై తక్షణమే విచారణ జరిపి పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు