జాంబీల ప్రపంచం ఇక తలకిందులేనట!
19-09-2026 | 05:05am
తేజ సజ్జ(Teja Sajja) హీరోగా నటిస్తున్న చిత్రం ‘జాంబీరెడ్డి(Zombie Reddy) 2 -నెక్స్ లెవల్’. ‘జాంబీరెడ్డి’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సుపర్ణ్ ఎస్ వర్మ(Suparn S Varma) దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాతలు. ఈ సినిమాతో షనాయా కపూర్ తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం అవుతుండగా, ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉపేంద్ర(Upendra) పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘ప్రపంచాన్ని తలకిందులు చేసేందుకు సిద్ధమైన రియల్ స్టార్’ అనే క్యాప్షన్‌కు తగ్గట్టు.. పోస్టర్లో భారీ చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడుతున్న ఉపేంద్ర.. వైల్డ్, ఫియర్స్, లార్జర్ దెన్ లైఫ్ అవతార్‌లో కనిపించారు.