పేదల కోసం పోరాడిన యోధుడు పండుగ సాయన్న
22-10-2026 | 11:18pm
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల(Rajanna Sircilla) జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన పండుగ సాయన్న జయంతి వేడుకల్లో(Panduga Sayanna Jayanthi Celebrations) మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య పాల్గొని, సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం పోరాడిన గొప్ప యోధుడు పండుగ సాయన్న అని కొనియాడారు. ప్రభుత్వం జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. సాయన్న పోరాట చరిత్రను నేటి తరానికి తెలియజేయాలని పిలుపునిచ్చారు.